ఓటరు జాబితాలపై దృష్టి సారించండి

జనవరి నాలుగవ తేదీన ఎన్నికల సంఘం ఓటరు జాబితాలను
ప్రచురించనున్న నేపథ్యంలో , ఓటరు జాబితాల్లోని వివరాలు సమగ్రంగా, సక్రమంగా ఉన్నాయా
అన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి
పిలుపు నిచ్చారు. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ జిల్లా అధ్యక్షులు,
పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలకు ఆయన ఒక లేఖ రాశారు. ఓటరు జాబితాలను
ఏ విధంగా పరిశీలించాలి, అవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి, ఆయా జిల్లాకు చెందిన
కాల్ సెంటర్ల నెంబర్లు తదితర వివరాలన్నిటిని ఆ లేఖలో వివరించారు. పార్టీ
శ్రేణులందరూ, ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎవరిపేరైనా లేనిపక్షంలో
తిరిగి నమోదు చేసుకోవడం తోపాటు, బోగస్ ఓటర్లను గుర్తించినట్లయితే ఆ  పేర్ల తొలగింపునకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని
ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.



Back to Top