కాగ్ అభ్యంతరాలపై వివరణలివ్వండి: భూమా నాగిరెడ్డి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాల అమలు తీరు, నిధుల వినియోగంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వ్యక్తం చేసిన అభ్యంతరాలపై  వివరణ ఇవ్వాలని ప్రజాపద్దుల సమితి (పీఏసీ) ఛైర్మన్ భూమా నాగిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీ ప్రాధమ్యాలను అధికారులు ఛైర్మన్ భూమా నాగిరెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలులో కాగ్ అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు వివరణలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Back to Top