అక్టోబర్‌ 1న వైయస్‌ఆర్‌ సిపి మెగా రక్తదాన శిబిరం

హైదరాబాద్‌, 19 సెప్టెంబర్‌ 2012: జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లోని నారాయణగూడలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ గోసుల శివ భరత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొంటారని ఆయన వివరించారు. నారాయణగూడలోని వైఎంసిఎ ఆవరణలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామని శివ భరత్‌ రెడ్డి తెలిపారు. అలాగే, 'రైజ్‌ యువర్‌ వాయిస్'‌ లాంటి పలు ఎన్‌జిఓ సంస్థలు, డాక్టర్‌ దుత్తా శాంతివర్ధన్‌ ట్రస్టు, వైయస్‌ఆర్‌ ఫ్రెండ్సు, ఫ్యాన్సు అసోసియేషన్‌ ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని ప్రకటనలో ఆయన తెలిపారు.

రక్తం ఎంత విలువైనదో మనందరికీ తెలిసిందే అని, ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతోందని తన ప్రకటనలో శివ భరత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే, దురదృష్టవశాత్తు కేవలం 40 లక్షల యూనిట్ల రక్తం మాత్రమే లభ్యమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మనం రక్త సేకరణలోనూ, నిల్వ చేయడంలోనూ ఎంతో వెనుకబడిపోయి ఉన్నామన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎజెండాలో చెప్పిన పలు సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య విభాగం ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు శివ భరత్‌రెడ్డి వివరించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడమే కాకుండా, ఇతరులు కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

గత నాలుగు నెలలుగా మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అనేక మంది బ్లడ్‌ కౌంట్‌ స్థాయిలు పడిపోయిన కారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, ఇతర విష జ్వరాలతో బాధలు పడుతున్నారని శివ భరత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ఎందరికో ప్రాణభిక్ష పెట్టే రక్తదానంలో వీలైనంత ఎక్కువ సంఖ్యలో దాతలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరమైన ప్రతి ఒక్కరికీ రక్తాన్ని అందుబాటులో ఉంచాలన్నది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని శివ భరత్‌రెడ్డి తెలిపారు. రక్తం అందుబాటులో లేక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోరాదన్న లక్ష్యంతో తమ పార్టీ వైద్య విభాగం కృషి చేస్తున్నదని ఆయన వివరించారు. ఇందు కోసం రాష్ట్ర వ్జాప్తంగా అవగాహన, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు.

Back to Top