258వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


విశాఖ: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖలో విజయవంతంగా కొనసాగుతోంది. 258వ రోజు ఆదివారం ఉదయం విశాఖలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గోపాలపట్నం మెయిన్‌రోడ్డు, బాజీ జంక్షన్, ఎన్‌ఏడీ జంక్షన్, ఓల్డ్‌ కరసా వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం మ్రరిపాలెం, కంచర్లపాలెం మీదుగా విశాఖ నార్త్‌ నియోజకవర్గంలోని ప్రవేశిస్తుంది. కంచర్లపాలెం వద్ద సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనతరం తాటిచెట్లపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్‌ తెలిపారు.

 
Back to Top