చంద్రబాబు హయాంలో మేళ్లు జరగవు



–శ్రీకాకుళం జిల్లాకు వైయస్‌ఆర్‌ ట్రిపుల్‌ ఐటీ మంజూరు చేశారు.
–ఇప్పటివరుకు ట్రిపుల్‌ ఐటి భవనానికి ఒక్క ఇటుక వేయలేదు..
–పైడి భీమవరం పారిశ్రామికవాడలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు..
–ఉన్నవాటిలో 7 పరిశ్రమలు మూతపడ్డాయి.
–పాకిస్తాన్‌ చెరలో ఉన్న మత్స్యకారులను తిరిగి రప్పిస్తాం..
–పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను పంపిస్తాం..
–ఏపీలో సమస్యలు వదిలేసి చంద్రబాబు తెలంగాణ  ఎన్నికలకు పోతారు..
–తిత్లీ తుపానుతో 1200 ఎకరాలు నష్టపోతే..400 ఎకరాలని చెప్పారు.
–తిత్లీ వల్ల రూ.3435 కోట్ల నష్టం వచ్చిందని చంద్రబాబు కేంద్రానికి లేఖ.
–రూ3435 నష్టమొస్తే చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ.520 కోట్లు
–తెలంగాణ ఎన్నికలు వస్తే చంద్రబాబు అక్కడే మకాం..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను  ఓడించాలని చంద్రబాబు అంటారు...
–ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నది ఎవరు..?
–ఫిరాయించిన  ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చింది ఎవరు?
–చంద్రబాబు హయాంలో ఐటిలో 85 వేల ఉద్యోగాలు ఉండగా..
–వైయస్‌ఆర్‌ హయాంలో 2.64 లక్షల ఉద్యోగాలకు పెరిగింది..
–చంద్రబాబు హయాంలో మేళ్లు జరగవు
–గతంలో సీఎంగా ఉండగా హైదరాబాద్‌లో ఆల్వీన్‌ అమ్మేశారు.
–నిజాం సుగర్స్,పాలేరు సుగర్స్, ఆదిలాబాద్‌ స్పిన్నింగ్‌ మిల్లు అమ్మేశారు..
–సహకార రంగంలో ఉన్న కర్మాగారాలన్నీ అమ్మేశారు.
–హెరిటేజ్‌ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని మూతవేయించారు.
–పోలవరం ప్రాజెక్టు అవినీతిమయం చేశారు.
–నాలుగు కత్తెర్లు, ఇస్తీ్ర పెట్టెలు ఇవ్వడం బీసీలపై ప్రేమా?
ఎన్నికలు వస్తున్నాయంటే చంద్రబాబుకు పేదలు గుర్తుకువస్తారు.
–పెన్షన్‌ కావాలంటే లంచం..రేషన్‌ కావాలంటే లంచం..

శ్రీకాకుళం: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజలకు మేళ్లు జరుగవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రజల ఆస్తులను అమ్మేశారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పిట్టల దొర కథలు చెబుతున్నారని, ఇలాంటి అన్యాయమైన ప్రభుత్వం పోవాలని, మనందరి ప్రభుత్వం వచ్చాక నవరత్నాలతో అందరికి ముఖాల్లో చిరునవ్వులు చూస్తామని చెప్పారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
– ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టగాని ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు..అన్నా..నాలుగున్నర సంవత్సరాలుగా కష్టాలే చూస్తున్నాం. ఈ జిల్లాలో 10 స్థానాలు ఉంటే టీడీపీకి గత ఎన్నికల్లో ఏడు స్థానాలు ఇచ్చామన్నా..ఇది సరిపోదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేను సంతలో పశువును కొన్నట్లు కొనుగోలు చేశారు. మా జిల్లాకు , మా ప్రాంతానికి చంద్రబాబు చేసింది ఏంటన్నా అని ఇక్కడి ప్రజలు చంద్రబాబును నిలదీస్తు అడుగుతున్నారు. ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు.
– ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కళా వెంకట్రావ్‌ ఉన్నారు. ఈ యన ప్రజల కోసం ఏ ఒక్క పని చేయరన్నా..కానీ చంద్రబాబుకు మాత్రం కాకాలు పడుతుంటారు. అందుకే ఆయనకు కాకాల వెంకట్రావ్, కమీషన్ల వెంకట్రావ్‌ అన్న పేరు ఉందన్నా..ఇంతే కాదన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో చంద్రబాబుకు తోడుగా ఉన్న బ్రోకర్‌ వెంకట్రావ్‌ అన్న పేరు అంటున్నారు. వెంకట్రావ్‌ మంత్రి అయిన తరువాత ప్రజలకు ఏం చేయలేదన్నా..ఈయన కొడుకుకు రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని రూ. 15 లక్షలకే కొట్టేశారన్నా అని ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు.
– ఈ మండలాలల్లో ఏ పని జరిగినా కళా బావమరిదికే ఇస్తారన్నా..ప్రభుత్వ భూములను తమవిగా చూపించి ఇక్కడి టీడీపీ నాయకులు రూ.30 కోట్లు నొక్కేశారని చెప్పుకొచ్చారు.
– అంబేద్కర్‌ యూనివర్సిటీ నాన్నగారి పుణ్యానా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆ యూనివర్సిటీలో ఇవాళ పరిస్థితి ఏంటంటే..చంద్రబాబు ఆ యూనివర్సిటీని నాశనం చేస్తున్నారని చెబుతున్నారు. అక్కడ పోస్టులు భర్తీ చేయడం లేదు. వసతలు కల్పించడం లేదు. 16 డిపార్టుమెంట్‌లు ఉంటే 96 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా కేవలం 12 మంది మాత్రమే రెగ్యులర్‌ అద్యాపకులుఉన్నారు. మిగతా వారంతా టెంపరరీ అధ్యాపకులను ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు శిక్షణ ఇ చ్చేందుకు ప్రత్యేక సెల్‌ లేదు. పరీక్షల నిర్వాహణ సక్రమంగా లేదు.
– నాన్నగారు జిల్లాలో త్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయించారు. దేశంలోనే ఈ త్రిపుల్‌ ఐటీకి పేరుందన్నా..చంద్రబాబు ఈ త్రిపుల్‌ ఐటీని రోడ్డుపైకి తెచ్చారు. 2016లో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేశారు. ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. మా పిల్లలను చదివించేందుకు నూజీవీడుకు తరలించారన్నా..న్యూజీవీడు నుంచి నిరుడు శ్రీకాకుళంకు వెయ్యి మందిని తెచ్చారన్నా..వారికి ఎలాంటి వసతులు కల్పించడం లేదన్నా..మూతపడిన ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువులు చెబుతున్నారని చెబుతున్నారు.  చంద్రబాబు కొత్తగా త్రిపుల్‌ ఐటీ పేరుతో చేసింది ఏంటని అడుగుతున్నారు. నూజీవీడులో 150 టీచర్లను ఏర్పాటు చేశారు. వారిలో ముగ్గురిని మాత్రమే పర్మినెంట్‌ చేశారని, మిగతా వారిని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
– అన్నా..చంద్రబాబు సీఎం అయ్యాక మా నియోజకవర్గంలో 34 స్కూళ్లను మూసివేశారు. స్థోమత లేని పిల్లలకు మంచి చదువులు చదివించాలని, ఖాళీ టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేస్తారు. ఐదు హాస్టళ్లను మూత వేయించారు.
–అన్నా..తోటపల్లి ప్రాజెక్టు మా ప్రాంతానికి చాలా మేలు చేసే ప్రాజెక్టు. చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఎన్నికలకు ముందు టెంకాయ కొట్టి వేళ్లాడు. నాన్నగారు సీఎం అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం జరిగాయని గొప్పగా ప్రజలు చెప్పుకుంటూ..మిగిలిపోయిన పది శాతం పనులు చేతకాని ముఖ్యమంత్రి కావాలనే చేయడం లేదన్నా అంటున్నారు. ఇవాల్టికి కూడా 85 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం లేదు. మా నియోజకవర్గంలోని 39 ఎకరాలకు సాగునీరు అందాలి. కానీ పది వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదు.
– మూడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే నారాయణపురం ఆనకట్టు ్ట ఈ రోజు శిథిలావస్థకు చేరిందని, 600 క్యూసెక్కుల నీరు కాల్వలో పారాల్సింది పోయి కేవలం 350 క్యూసెక్కులు కూడా ప్రవహించడం లేదని, పంటలు ఎండుతున్నాయని చెబుతున్నారు. మడ్డు వలస ప్రాజెక్టు ఫేస్‌ –2 నుంచి రెండు ఉప కాల్వల ద్వారా అదనంగా 12 వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని ఆ రోజు నాన్నగారు రూ. 48 కోట్లు మంజూరు చేశారని, మహానేత చనిపోయిన తరువాత ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని చెబుతున్నారు. 
– ఇదే నియోజకవర్గంలోని పైడి భీమవరంలోని పారిశ్రామిక వాడలో అక్షరాల ఏడు పరిశ్రమలు మూతపడ్డాయి. కొత్తగా ఉద్యోగాలు రావడం దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాల్లో కోత పెడుతున్నారు. ఉన్న పరిశ్రమల్లో మన రాష్ట్రం, మన జిల్లా ప్రజలకు 20 శాతం కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇవాళ మీ అందరికి ఒక్కటే మాటిస్తున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి నిరుద్యోగికి చెబుతున్నాను. అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే ఒక చట్టం చేస్తామని, స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా తీర్మానం చేస్తాం.
– చేనేతల బతుకులు ఎలా ఉన్నాయో చూస్తే బాధనిపించింది. చేనేతలకు నూలుపై సబ్సిడీపై ఇవ్వాల్సిన వెయ్యి ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కో కింద  చేనేతలకు రావాల్సిన రూ.290 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇదే జిల్లాలో 13 సొసైటీలకు బకాయిలు ఉన్నాయని చేనేతలు చెబుతున్నారు. సోసైటీలకు డబ్బులు రావడం లేదు కాబట్టి చేనేతలకు డబ్బులు అందడం లేదు. ఇంతకన్నా దిక్కుమాలని ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?
– ఇదే నియోజకవర్గానికి చెందిన మత్స్యకార సోదరులు నా వద్దకు వచ్చారు. నిజంగా పనులు దొరక్క వలస పోతున్నారు. రూ.8 వేల కోసం గుజరాత్‌కు వెళ్తున్నారు. అక్కడ బోట్లలో పనిచేస్తుంటే..వీరికి తెలియక పాకిస్థాన్‌ సరిహద్దుల్లోకి వెళ్తే అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మా ఎంపీలు ఇద్దరిని పంపించి మత్స్యకారులను వెనక్కి తీసుకువస్తామని మాట ఇస్తున్నాను. ఇదే నియోజకవర్గానికి చెందిన 13 మంది అక్కడ ఉన్నారు. 
– ఒకవైపు సమస్యలు దారుణంగా ఉంటే..ఈ పెద్ద మనిషి తెలంగాణలో ఎన్నికల కోసం వెళ్తారు. తిత్లీ తుపాను వచ్చి ఈ మండలంలో దాదాపు 1200 ఎకరాలను నాలుగు వందలకు కుదించారు. తిత్లీ బాధితులకు చంద్రబాబు చేసింది ఏమీటి? తుపాను రాకముందే తోడుగా ఎలా నిలవాలని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలోచన చేస్తారు. పక్కన ఒడిసాలో  ఇవ్వన్నీ కనిపిస్తాయి. అక్షరాల రూ.3435 కోట్లు నష్టం వచ్చిందని చంద్రబాబే కేంద్రానికి లేఖ రాశారు. మీ అందరి తరఫున అడుగుతున్నా..రూ.3435 కోట్ల నష్టంలో నీవు తిత్లీ బాధితులకు ఎంత డబ్బులు ఇచ్చావు. చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ.520 కోటుల మంజూరు చేశారు. అందులో కూడా రూ.250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇదే పెద్ద మనిషి బాధితుల గురించి చంద్రబాబు పబ్లిసిటీ ఎలా ఉంది. ఏ బస్సు చూసినా చంద్రబాబు ఫోటో కనిపిస్తుంది. ఈయన బాధితులను గొప్పగా ఆదుకున్నట్లు విజయవాడలో ఫ్లెక్సీలు పెడతారు. 15 శాతానికి ఇచ్చిన పరిహారానికి ఏ బస్సు చూసినా ఆయన ఫొటోనే..ఈయన వ్యవహారం ఎలా ఉందంటే..చనిపోయిన తరువాత శవం తీసుకెళ్తుంటే దానిపై చిల్లర చల్లుతారు. చంద్రబాబు వ్యవహారం ఇలాగే ఉంది. 
– చంద్రబాబు పరిపాలన ఒక్కసారి చూడండి. తుపాను నుంచి అనేక సమస్యలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. వీటిని పరిష్కరించాల్సింది పోయి..ఈ ముఖ్యమంత్రి ప్రజలను గాలికి వదలి డ్రామాలాడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు వస్తే..అదేదో ఈయన సొంత రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినట్లు తిరుగుతున్నారు. ఇక్కడి సమస్యలను గాలికి వదిలేసి తెలంగాణలో మకాం వేశారు. ఈయన ఆడుతున్న డ్రామాలు చూస్తే ఇంతకన్న అన్యాయమైన వ్యక్తి ప్రపంచంలో మరెక్కడ ఉండరేమో. పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలను చంద్రబాబు ఏమంటారు. వారు నమ్మక ద్రోహులట... వాళ్లను చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తారు. వాళ్లు అన్యాయస్తులు, అమ్ముడపోయారని అంటున్నారు. మరీ ఆంధ్ర ప్రదేశ్‌లో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశావు. అందులో నలుగురిని మంత్రులుగా చేశావు. అదే అన్యాయం గురించి పక్క రాష్ట్రంలో ఏమి జరగనట్లు చంద్రబాబు మాట్లా డుతుంటే విశ్వసనీయతకు, విలువలకు ఎక్కడైనా అర్థం ఉందా? ఈ పెద్ద మనిషి అంతటితో ఆగిపోలేదు. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేలా అబద్ధాలు చెప్పారు. తెలంగాణలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, రింగ్‌ రోడ్డు ఆయనే కట్టారట. చంద్రబాబు..ఎప్పుడైనా అబద్ధాలు చెప్పే సమయంలో ప్రజలకు ఏమి తెలియదనుకుంటావా? శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు 2005లో పనులు ప్రారంభమయ్యాయి. 2008లో పూర్తి అయ్యాయి. రింగ్‌ రోడ్డు పనులు మోదలైంది 2005 డిసెంబర్‌లో అయితే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌హయాంలో కాదా పూరై్తంది. పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్‌ 15 కిలోమీటర్ల పొడవునా నిర్మించింది వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాదా? ఇవన్నీ తాను చేశాడు కాబట్టి ఎయిర్‌ పోర్టుకు వెళ్లే దారులు, రింగ్‌రోడ్డు పనులు చేపట్టడం కారణంగానే హైదరాబాద్‌లో ఐటీ రంగం పరుగులు తీసింది వైయస్‌ఆర్‌ హయాంలో కాదా? చంద్రబాబు హయాంలో ఐటీ రంగం వృద్ధి రేటు 8 శాతం అయితే..వైయస్‌ఆర్‌ హయాంలో 15 శాతం వృద్ధి రేటు సాధించింది. ఐటీ కంపెనీలు చంద్రబాబు హయాంలో 909 కంపెనీలు ఉంటే వైయస్‌ఆర్‌ మరో 1500 ఐటీ కంపెనీలు వచ్చిన మాట వాస్తవం కాదా? ఐటీలో ఉద్యోగాల సంఖ్య 945 ఉంటే..వైయస్‌ఆర్‌ హయాంలో 2, 35, 300 ఉద్యోగాలు వచ్చాయి. చంద్రబాబు హయాంలో ఐటీ పెట్టుబడులు రూ.330 కోట్లు అయితే వైయస్‌ఆర్‌ హయాంలో రూ.13200 కోట్ల ఐటీ రంగ పెట్టుబడులు వచ్చింది వాస్తవం కాదా చంద్రబాబు?. ఐటీ ఎగుమతులు చంద్రబాబు హయాంలో రూ.520 కోట్లు అయితే, వైయస్‌ఆర్‌ హయాంలో రూ. 33,422 కోట్లు ఎగుమతులు వాస్తవం కాదా? . చంద్రబాబు హయాంలో ఎప్పుడు మేలు జరుగదు. ఆయన హయాంలో ముఖ్యమంత్రిగా ఉండి చేసింది ఏమిటో తెలుసా..? హైదరాబాద్‌లోని ఆల్వీన్, రిపబ్లిక్‌ కంపెనీని అమ్మేశారు. నిజాం షుగర్స్‌ కంపెనీని అమ్మేశారు. పాలేరు షుగర్‌ కంపెనీని అమ్మేశారు. అదిలాబాద్‌ స్విన్నింగ్‌ మిల్లు అమ్మేశారు. సిరిపుర్‌ పేపర్‌ మిల్లు అమ్మేశారు. మన రాష్ట్రంలోని నంద్యాల, బొబ్బిలి, హనుమాన్‌జంక్షన్, ఆమదాల వలస, కొవ్వూరు సహకార రంగంలోని చక్కర ఫ్యాక్టరీలను అమ్మేశారు. రాజమండ్రి, పరచూరు స్విన్నింగ్‌ మిల్లులు అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది. తన సొంత కంపెనీ హెరిటేజ్‌ కోసం సొంత జిల్లాలోని చిత్తూరు డయిరీని కూడా మూసేయించారు. అక్షరాల 54 కంపెనీలను చంద్రబాబు శనగకాయలకు, బెల్లానికి  ఇష్టం వచ్చిన రేట్‌కు అమ్మేశారు. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ప్రజలకు ఏమి తెలియదనుకుంటున్నారు. మాటి మాటికి సెల్‌ ఫోన్‌ తానే కనిపెట్టానని చెబుతారు. కంప్యూటర్‌ కూడా ఈయనే కనిపెట్టారట. మైక్రోస్టాప్‌ సంస్థ సీఈవో సత్యనాదేళ్లకు కంప్యూటర్‌ నేర్పించారట. సింధూకు కూడా బ్యాడ్మింటన్‌ నేర్పించారట. ఇటువంటి పిట్టల దొర కథనాలు చెబుతుంటే ఈయనను నిజంగా ఏమనాలి. ఏదైనా మంచి మనిషి అయితే ప్రజల వద్దకు వచ్చి క్షమాపణ చెబుతారు. కానీ ఈ పెద్ద మనిషి నోరు తెరిస్తే చాలు అబద్దాలు, మోసాలు, అవినీతి చూస్తున్నాం.
– ఎన్నికలకు ముందు ఇచ్చిన  ఏ  ఒక్క హామీ అమలు కాలేదు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కాలేదు. నిరుద్యోగులకు భృతి అందలô దు. ఉద్యోగాలు రాలేదు. 
– రాష్ట్రంలో మైనస్‌ 35 శాతం వర్షపాతం నమోదైంది. ఖరీప్‌కు సంబంధించిన రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ రైతుకు ఇవాళ గిట్టుబాటు ధర రావడం లేదు. వరికి మద్దతు ధర రూ.1550 అంటున్నారు. రైతులు అమ్మాలంటే రూ.1100 మించి రావడం లేదు. దళారీ వ్యవస్థను కట్టడి చేయకుండా తన సొంత కంపెనీ లాభాల కోసం రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్యాక్‌ చేసి మూడు రేట్లకు ఎక్కువగా అమ్ముకుంటున్నారు.  
– రాష్ట్రంలో కరెంటు, ఆర్టీసీ చార్జీలు, స్కూల్‌ ఫీజులు, పెట్రోల్, డీజిల్‌ ధరల బాదుడే బాదుడు. పక్కనే జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ..అక్కడ ఫీజులు ఎంతో తెలుసా? రూ.1.04 లక్షల ఫీజులు చెల్లించాలి. చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కింద రూ.30 వేలు ముష్టి వేసినట్లు ఇస్తున్నారు. అది కూడా రెండేళ్లుగా అందడం లేదని విద్యార్థులు నాతో అంటున్నారు. ఎన్నికలొస్తే బీసీలపై ప్రేమ అంటున్నారు. నాలుగు కత్తెర్లు, ఇస్తీ్ర పెట్టేలు ఇస్తే అదేనా ప్రేమంటే..నిజంగా బీసీలపై ప్రేమ చూపించింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గొప్పగా చెబుతాను. ఆ రోజు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఫీజులు మొత్తం చెల్లించేవారు. ఇవాళ తమ పిల్లలను చదివించేందుకు ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పడకేసింది. ఆడవాళ్లు ప్రసవం చేయించుకోవాలంటే రూ.50 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 108 వాహనం సమయానికి రావడం లేదు. పింఛన్‌ కావాలన్నా..రేషన్‌కార్డు కావాలన్నా..మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా సాగుతోంది. ఏదైన సంక్షేమ పథకం కావాలంటే ఏ పార్టీ అంటున్నారు. లంచాలు ఇవ్వనిదే ఏ ఒక్క పని కావడం లేదు. గతంలో రేషన్‌ షాపుల్లో బియ్యంతో పాటు కందిపప్పు, నూనే, కారం, పసుపు, ఉప్పు, చింతపండు ఇచ్చేవారు. ఇవాళ బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. 
– ఇవాళ గ్రామ గ్రామాన, వీధి వీధిలో..గుడి పక్కన, బడి పక్కన మందు షాపులు ఉన్నాయి. మంచినీళ్ల మినరల్‌ ప్లాంట్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ, బెల్టు షాపులు మాత్రం ఉన్నాయి.
– ఇలాంటి అన్యాయమైన పాలన పోయి..మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం రావాలి. నాలుగున్నరేళ్లు మోసాలు, అవినీతి, అన్యాయమైన పాలన చూశాం. ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. ఎన్నికల ప్రణాళికలో పెట్టిన హామీలు చేయకపోతే ఆ నాయకుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడు ఈ వ్యవస్థలో నిజాయితీ వస్తుంది. చంద్రబాబు అన్యాయమైన పాలన పోవాలి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఈ మీటింగ్‌లో నవరత్నాల్లో నుంచి అవ్వతాతలకు ఏం చేస్తామన్నది ఈ మీటింగ్‌లో చెబుతున్నాను.
– ప్రతి అవ్వకు, తాతకు చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫించన్‌ వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాను. పింఛన్‌ ప్రతి నెల రూ.2 వేలు ఇస్తానని మాట ఇస్తున్నాను. రాబోయే సభలో మిగిలిన నవరత్నాల గురించి చెబుతాను. ఇందులో ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా..సలహాలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉన్నానో మీ అందరికీ తెలుసు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలు దేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా ఉండమని, దీవించమని కోరుతూ..పేరు పేరున మరోక్కసారి  చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా..  
Back to Top