పోటెత్తిన రాజోలు

తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ రానుండ‌టంతో రాజోలు ప‌ట్ట‌ణం వేలాది జ‌నంతో పోటెత్తింది. ఇవాళ సాయంత్రం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగించ‌నుండ‌టంతో నియోజ‌క‌వ‌ర్గం నుంచి వేలాదిగా జ‌నం త‌ర‌లివ‌చ్చారు. దీంతో ప‌ట్ట‌ణంలోని వీధులు కిట‌కిట‌లాడుతున్నాయి. ప‌ట్ట‌ణ‌మంతా వైయ‌స్ జ‌గ‌న్ ఫోటోలు, వైయ‌స్ఆర్‌సీపీ ఫ్లెక్సీల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. వైయ‌స్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
Back to Top