<br/> శ్రీకాకుళం: ప్రతి అడుగు.. ఓ భరోసాగా ప్రజల సమస్యలను వింటూ వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కు శ్రీకాకుళం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం ఉదయం జననేత దుర్గమ్మ పేట శివారు నుంచి 326వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి లక్ష్మీపురం క్రాస్, సవరపేట క్రాస్, శివరాంపురం క్రాస్, సంతబొమ్మళి, బోరభద్ర క్రాస్, జగన్నాథపురం క్రాస్, వడ్డి తాండ్ర మీదుగా దండుగోపాలపురం వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. వైయస్ జగన్ రాకతో గ్రామాల్లో పండుగవాతవరణం నెలకొంది. ప్రజలు తమ బాధలు రాజన్న బిడ్డకు చెప్పుకొని స్వాంతన పొందుతున్నారు. రాజన్న రాజ్యం తీసుకురావాలని వేడుకుంటున్నారు.<br/>