ముదినేపల్లి నుంచి 157వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

కృష్ణా జిల్లా : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 157వ రోజు పాదయాత్రను కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి శివారు నుంచి వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించారు. అక్క‌డి నుంచి పెయ్యేరు, డాకరం క్రాస్‌, కానుకొల్లు, పుట్ల చెరువు క్రాస్‌, లింగాల మీదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. పెరికగూడెంలో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారు. సమావేశం అనంతరం రాత్రికి ఆయన ఇక్కడే బస చేస్తారు.

 

తాజా ఫోటోలు

Back to Top