కొబ్బరిచెట్లపేట నుంచి 325వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 

 శ్రీకాకుళం: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 325వ రోజు బుధవారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని కొబ్బరిచెట్లపేట నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి జార్జంగి, కొత్తపేట, కోటబొమ్మళి, సీతన్నపేట మీదుగా దుర్గమ్మపేట వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. 
వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. జననేతను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. వైయ‌స్‌ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు యువతీ, యువకులు పోటీపడుతున్నారు.


తాజా వీడియోలు

Back to Top