చప్పబుచ్చమ్మపేట నుంచి 294వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

 

 విజయనగరం : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 294వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం మక్కువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పేకపాడు వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.

వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లోని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.

 


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top