జిన్నాం నుంచి 283వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభంవిజ‌య‌న‌గ‌రం :  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిఒక్కరినీ పలకరిస్తున్నారు. అందరి సమస్యలూ తెలుసుకుంటున్నారు. కన్నీళ్లు తుడుస్తున్నారు. కష్టాలు తీరే కాలం మరెంతో దూరంలో లేదని తెలియజేస్తున్నారు.  అందుకే ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు తమ గడపకు పండగొచ్చినట్టు భావిస్తున్నారు. ముంగిటకు వచ్చిన రాజన్న బిడ్డను చూసి ఆనంద పారవశ్యమవుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పూల వర్షంతో అభిమానం చూపిస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 283వ రోజు పాదయాత్ర జిన్నాం నుంచి ప్రారంభమైంది. అక్క‌డి నుంచి గజపతినగరం నియోజకవర్గంలోని లింగాల వలస, లోగిస క్రాస్‌, కొత్త శ్రీరంగ రాజపురం, నారాయణ గజపతిరాజపురం, గజపతినగరం వరకు నేడు పాదయాత్ర కొనసాగనుంది. ఈ సాయంత్రం గజపతినగరంలో జరిగే బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.  అడుగడుగునా ప్రజాసమస్యలు సమస్యలు తెలుసుకుంటూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. జ‌న‌నేత‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావారణం నెలకొంది. 


తాజా వీడియోలు

Back to Top