మూల స్టేషన్‌ నుంచి 279వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
విజ‌య‌న‌గ‌రం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. శనివారం ఉదయం జననేత 279వ రోజు పాదయాత్రను మూల స్టేషన్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చీపురుపల్లి నియోజకవర్గం ఎస్‌ఎస్‌ఆర్‌ పేట, సోలుపు క్రాస్‌, మన్యపురి పేట, బెల్లాన పేట, వల్లాపురం క్రాస్‌ వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.  

జననేత వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్‌ జగన్, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top