చీరాల నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

ప్రకాశం: వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చీరాల నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం చీరాల శివారు నుంచి వైయ‌స్‌ జగన్‌ 109వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి కొత్తపేట, ఆంధ్రకేసరి జూనియర్‌ కాలేజీ, బాలాజీ థియేటర్‌, పేరాల, ఐటీసీ మీదుగా ఆదినారాయణపురం చేరుకుని రాజన్న భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతుంది. అనంతరం ఈపురుపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈపురుపాలెంలో వైయ‌స్‌ జగన్‌ ప్రజలతో మమేకం కానున్నారు. పాదయాత్రలో ఇప్పటి వరకు జననేత 1462 కిలోమీటర్లు నడిచారు.


Back to Top