చిత్తూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రజల నీరాజనాల మధ్య దిగ్విజయంగా కొనసాగుతుంది. 46వ రోజు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం బలిజపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. చిత్తూరు జిల్లా తంబళపల్లి మండలం ఎద్దులవారికోటలో అడుగుపెట్టిన వైయస్ జగన్‌కు ప్రజలు పూలవర్షంతో ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తంబళపల్లి వద్ద జననేత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు.