ఉద్యోగ భద్రత లేదన్నా..


వైయస్‌ జగన్‌కు గిరిజన కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల మొర

విజయనగరంః  గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.ఏళ్ల తరబడి పనిచేస్తున్నా రెగ్యులర్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోస్టులను డీఎస్సీలో చూపి రోడ్డున పడేలా చేస్తున్నారని వాపోయారు.çసుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా  సమాన పనికి సమాన వేతనం కల్పించడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 16 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నామన్నారు. అరకొర జీతాలతో బతుకుతున్న రెగ్యులర్‌ అవుతుందనే ఆశతో పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగభద్రత లేకుండా పోయిందన్నారు.
Back to Top