జగన్‌ వెన్నంటే మేమంతా..

విజయనగరంః సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఎన్ని ఆందోళనలు చేసిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఉపాధ్యాయ సంఘం నేతలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారు.  కోరుకొండలో వైయస్‌ జగన్‌ను ఉద్యోగ,ఉపా«ధ్యాయ సంఘాలు కలిశాయి. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వడం పట్ల మరోసారి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.అసెంబ్లీల్లో తీర్మాణాలు, కమిటీలకు ఉద్యోగులు వ్యతిరేకమని సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరారు. జీవో రద్దుచేసీ పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలన్నారు.  రాష్ట్రంలో ఏపీసీపీఎస్‌ఈఏ పోరాటాలు చేస్తుందన్నారు. అధికారంలోకి రాగానే వారంరోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్‌ హామీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. ఉద్యోగులమంతా జగన్‌ వెన్నంటే ఉన్నామని తెలిపారు. 
Back to Top