వైయస్‌ జగన్‌ను కలిసిన వీఆర్‌ఏలు

నెల్లూరు:

ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో వీఆర్‌ఏలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు

Back to Top