వైయస్‌ఆర్‌సీపీలోకి అక్కుపల్లి గ్రామ టీడీపీ నేతలు

వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిక

శ్రీకాకుళంః ప్రజల కోసం వైయస్‌ జగన్‌ పడుతున్న తాపత్రాయన్ని చూసి వివిధ పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీకి ఆకర్షితులవుతున్నారు.జననేతతో కలిసి అడుగులో అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.పలాస నియోజకవర్గం అక్కుపల్లికి చెందిన టీడీపీ నేతలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వైయస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.టీడీపీలో ఉంటున్న సరైన గుర్తింపు,గౌరవం లేదని పార్టీ మారిన నేతలు అన్నారు.గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు మితిమీరిపోయాయని ఆరోపించారు. వైయస్‌ జగన్‌ విశ్వసనీయత, సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరడం జరిగిందన్నారు.టీడీపీ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలేదని  దోచుకుంటున్నారని తెలిపారు.

 

Back to Top