ఇసుక మాఫియా పెచ్చుమీరుతోంది..

వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేసిన రాజాం ప్రజలు..

శ్రీకాకుళం: రాజాం నియోజకవర్గంలో ఇసుక మాఫియా పెచ్చుమీరుతుందని రాజాం నియోజవర్గం ప్రజలు వైయస్ జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రోజుకు రెండు, మూడు వందల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. నాగావళి నదిలో ఇసుకను తవ్వేయడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మొర పెట్టుకున్నారు.టీడీపీ అండదండలతో ఇసుకను దోచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.సామాన్యంగా ఒక ట్రాక్టర్ ఇసుక ఖరీదు వెయ్యి రూపాయలు అని, 2,500 రూపాయలు పెట్టి ఇసుక ను కొనవలసి వస్తుందన్నారు.దీనికి కారణం ఇసుక మాఫియా అని, టీడీపీ నేతలు పెత్తనంతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇసుక ఉచితమని టీడీపీ ప్రభుత్వం ప్రకటనలే తప్ప ఎక్కడ కానరావడంలేదన్నారు.ఇసుక దొరకపోవడంతో పేదలు ఇళ్లు నిర్మాణలు కూడా ఆగిపోయాయని తెలిపారు. కనీసం ఆలయ నిర్మాణలకు ఇసుక ఇవ్వడం లేదన్నారు.