మా సమస్యలు పరిష్కరించన్నా....ఆటో డ్రైవర్లు

గుంటూరు:

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వివిధ వర్గాల ప్రజలు తాము పడుతున్న కష్టాలను వివరిస్తున్నారు. సోమవారం గుంటూరు ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు ఆయనను కలుసుకుని తమ గోడు వెలిబుచ్చుకున్నారు. తాము చెమటోడ్చి సంపాదించిన దానిలో అధిక మొత్తం టాక్సులు, పెట్రోలు, డీజిల్ ల కే సరిపోతోందని వారు వాపోయారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై జననేతకు ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. పన్నులు, చమురు ఖర్చులు మినహాయిస్తే, రోజుకు 300 కూడా సంపాదించలేని దుస్థితిలో తాము బ్రతుకు వెళ్లదీస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రోడ్ టాక్సును ఎత్తివేయాలని, డ్రైవింగ్ లైసెన్సుకు కనీస విద్యార్హత నిబంధనను సడలించాలని, తమ పిల్లలకు కూడా స్కాలర్ షిప్ లు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. వీరి సమస్యలను విన్న జననేత పరిష్కరించేందుకు చొరవ చూపుతానంటూ భరోశా కల్పించారు.

తాజా వీడియోలు

Back to Top