వేదపండితుల ఆశీర్వాదం

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దెందులూరులో వేద పండితులు ఆశీర్వదించారు. పాదయాత్ర విజయవంతం కావాలని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రాజన్న పాలనను అందించాలని పండితులు దీవించారు. మరికాసేపట్లో ప్రజా సంకల్పయాత్ర ఏలూరు నియోజకవర్గం వెంకటాపురంలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ఈ మేరకు వైయస్‌ జగన్‌ వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 
Back to Top