<strong>– ఎమ్మెల్యే రాజేంద్రనాథ్‌రెడ్డి</strong>కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టగానే టీడీపీ నేతలు భయపడుతున్నారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బేతంచర్లలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ..వైయస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. వైయస్ జగన్ సీఎం కాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్నారు. రామరాజ్యం..రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ తీసుకొని వస్తారని చెప్పారు.