<br/>శ్రీకాకుళం: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కేశవరెడ్డి స్కూల్ డిపాజిట్‌దారులు కలిశారు. ఒక్కొ విద్యార్థి నుంచి రూ.2.50 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు తీసుకొని ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరెడ్డి కారణంగా తమ బిడ్డల భవిష్యత్తు నాశనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి వైయస్ జగన్ హామీ ఇచ్చారు. మనందరి ప్రభుత్వం రాగానే డిపాజిట్‌దారులను న్యాయం చేస్తామని మాట ఇచ్చారు.