37వ ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 37వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం వద్ద ఆదివారం ఉదయం 8 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 8.30 గంటలకు తుమ్మల, 8.45 గంటలకు తిప్పేపల్లి క్రాస్, 10 గంటలకు రావుల చెరువు ఎస్సీ కాలనీ, 11 గంటలకు రావుల చెరువు గ్రామానికి వైయస్‌ జగన్‌ చేరుకుంటారు. 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతంది. 3.15 గంటలకు య్రరగుంట్ల పల్లె తాండ క్రాస్, 3.30 గంటలకు రావులచెరువు తాండ, 4.30 గంటలకు వెంకట తిమ్మాపురం, 5.30 గంటలకు దర్శినమల గ్రామం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 6.30 గంటలకు 37వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.
 
Back to Top