రాచ గున్నేరు వద్ద జననేతకు వినూత్న స్వాగతం

శ్రీకాళహస్తి :రాచగున్నేరు వద్ద మత్స్య కారులు ప్రతి పక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్ప యాత్రకు  వినూత్న రీతిలో స్వాగతం పలికారు. తమ జీవనాధారమైన పడవలను సుందరంగా అలకరించి, వైయస్ ఆర్ సీపీ పతాకాలను కట్టి అభిమానంతో ఆహ్వానించారు. తెలుగుదేశం నాయకులు చేపల వేటను కూడా రాజకీయం చేస్తూ, పొట్ట కొడుతున్నారంటూ జననేతతో ఆవేదనను చెప్పుకున్నారు. వీరందరికీ భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రగా ముందుకు సాగారు.

Back to Top