వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం

సామర్లకోట : పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు
వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా సమస్యలను పరిష్కరించమంటూ
విన్నవిస్తున్నారు. ఆదివారం ఉదయం గోంచాల గ్రామంలో వికలాంగులు తమ సంక్షేమానికి ఉద్దేశించిన
చట్టలాను ప్రభుత్వం అమలు పరచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఉపాథి, ఫించన్లు, సంక్షేమ
కార్యక్రమాల్లో ప్రాధాన్యతకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ తమను
నిర్లక్షం చేస్తున్నారని వారు వాపోయారు. వీరి సమస్యల పరిష్కారానికి చొరవ
చూపుతానంటూ జగన్ హామీ ఇచ్చారు.

Back to Top