<br/>శ్రీకాకుళం: వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోతున్నామని శ్రీకాకుళం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 324వ రోజు చల్లవానిపేటలో పలువురు రైతులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తుపాన్లతో పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ ఈ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని, త్వరలోనే మనందరి ప్రభుత్వం వస్తుందని రైతులకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.