భూములిచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదయ్యా...

 
జననేతకు మెట్టవలస రైతుల గోడు..
విజయనగరంః బిబ్బిలి గ్రోత్‌సెంటర్‌ నిర్మాణానికి భూములిచ్చినా తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదని  మెట్టవలస గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. కంపెనీలు వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుందని ఫిర్యాదు చేశారు.  కాలుష్యం వల్ల పంటలు పండటంలేదని వాపోయారు. వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన న్యాయం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని రైతులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్దిచెబుతామన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top