కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌జగన్ మోహన్‌రెడ్డిని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కలిశారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ క్రమబద్దీకరించాలని వారు కోరారు. సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వారు జననేతను కోరారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.