వేతనాలు తగ్గించారు...కాంట్రాక్టు లెక్చరర్ల ఆవేదన

కందుకూరులో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని  కాంట్రాక్టు లెక్చరర్లు కలుసుకుని  తమ సమస్యలను పరిష్కరించమని విజ్ఞప్తి చేసారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ఇచ్చిన హామీని విస్మరించారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో దాదాపు 4300 మంది కాంట్రాక్టు లెక్చరర్లు  పనిచేస్తున్నారని   అగమ్య గోచరమైన భవిష్యత్తుతో జీవితాలను నెట్టుకుని వస్తున్నామని వారు తమ గోడును జననేత వద్ద వెలిబుచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ఇప్పుడు వేతనాలు కూడా తగ్గించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బేసిక్ పే కూడా రద్దు చేసి అన్యాయం చేశారని వారు చెప్పారు.  మహిళలకు కనీసం ప్రసూతి సెలవులు కూడా ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని వారు వాపోయారు. కాంట్రాక్టు లెక్చరర్లుగా అనేక మంది రిటైర్ అవుతున్నారని వివరించారు.  ఈ  సమస్యలన్నిటినీ విన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు.  
Back to Top