అనంతపురం: వేతనాలు పెంచాలని మూడున్నరేళ్లుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యుత్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా గుత్తి రోడ్డుపై విద్యుత్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వైయస్‌జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు.