చంద్రబాబు హామీలు నమ్మి మోసపోయాం


వైయస్‌ జగన్‌కు నిరుద్యోగులు,డీఈడీ విద్యార్థుల మొర..

శ్రీకాకుళంః బూరాడ వద్ద వైయస్‌ జగన్‌ను నిరుద్యోగులు కలిసి తమ మొర వినిపించారు. ఇంజనీరింగ్, పీజీ చదివినా ఉద్యోగాలు రాలేదని వాపోయారు.కోచింగ్‌ల కోసం లక్షల ఖర్చుచేస్తున్నామన్నారు.చంద్రబాబు హామీలు నమ్మి మోసపోయామని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందన్నారు.వైయస్‌ జగన్‌ సీఎం అయితే తమ కష్టాలు తీరుతాయని యువత ఆశాభావం వ్యక్తం చేసింది.అలాగే  వైయస్‌ జగన్‌ను డీఈడీ విద్యార్థునులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.ప్రభుత్వం డీఎస్సీ పదేపదే వాయిదా వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.పోస్టుల్లో కోత విధిస్తుందని డీఈడీ విద్యార్థునులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రతి ఏటా మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top