వైయ‌స్ జ‌గ‌న్‌కు భ‌ద్ర‌త క‌రువు

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది. అయితే ప్ర‌భుత్వం మాత్రం స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నెల 14 నుంచి క‌ర్నూలు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర సాగుతోంది.  నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తక్కువ సంఖ్యలో పోలీసులను ఉంచడంతో భద్రత పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పాటు, పెద్ద సంఖ్యలో జనం పాదయాత్రలో పాల్గొనడంతో బందోబస్తు గందరగోళంగా మారింది. ఉదయం కేవలం ఇద్దరు ఎస్‌ఐలతో మాత్రమే బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతపై వైయ‌స్ఆర్‌సీపీ కి చెందిన నాయకులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కడప జిల్లాలో భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు ఉంటే.. కర్నూలులో పాల్గొన్న పాదయాత్రకు నామమాత్రంగా పోలీసుల సంఖ్య ఉండడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పోలీసులపై పార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావడంతో సాయంత్రం ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, ఇద్దరు పోలీసులతో భద్రత కల్పించారు. అయితే డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఉండాల్సిన నేపథ్యంలో తక్కువ సంఖ్యలో పోలీసులను నియమించడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది.  

Back to Top