పొదిలి: వైయస్సార్‌సీపీతోనే మెరుగైన పాలన సాధ్యమవుతోందని ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో జరిగిన వైయస్సార్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమాన్ని సర్పంచ్ చాగంరెడ్డి మాలకొండారెడ్డి ప్రారంభించారు. సభ్యత్వం చేర్పించడంతో పాటూ, నవరత్నాల పథకాలకు సంబంధించి బ్రోచర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు వెలుగోలు కాశీ, పార్టీ నాయకులు అల్లాడిపల్లి కొండారెడ్డి, బాల కోటేశ్వరరావు, కోటిరెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.<br/>