వైయ‌స్‌ఆర్‌ కుటుంబంతో ప్రజలకు భరోసా

కడప: వైయ‌స్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమంతో ప్రజలకు భరోసా ఏర్పడుతుందని ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్‌ కె. సురేష్‌బాబు అన్నారు. శనివారం స్థానిక 40వ డివిజన్‌ మరియాపురంలో వైయ‌స్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైయ‌స్‌ఆర్‌ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఆసక్తిగా ఉన్నారా అని అడిగి తెలుసుకొని 9121091210 ఫోన్‌ నంబర్‌కు వారిచే మిస్డ్‌ కాల్‌ ఇప్పించి సభ్యత్వం అందజేశారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాల గూర్చి వివరించి, ఎన్నికల హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా మేయర్, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్‌ఆర్‌ కుటుంబ సభ్యులుగా చేరుతారా అని అడుగగానే చాలామంది సంతోషంగా అంగీకరిస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అమరావతి పేరుతో లక్షల కోట్లు సంపాదించి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధులు ఇవ్వకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బూతు కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు, నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు విజయరాణి, పాకా సురేష్, చైతన్య, ఎంఎల్‌ఎన్‌ సురేష్, స్థానిక నాయకులు బాలస్వామి రెడ్డి, అల్ఫోన్స్, ప్రదీప్, టీపీ వెంకట సుబ్బమ్మ, మరియలు, జి. మధువర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top