వైయస్ఆర్ ధర్మపాలన వైయస్ జగన్ తోనే సాధ్యం

కర్నూలు(పాణ్యం))దివంగత నేత డా. వైయస్ రాజశేఖరరెడ్డి ధర్మపాలన వైయస్ జగన్ తోనే సాధ్యమని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాబు వచ్చాడు జాబులు పోతున్నాయని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదని, అనర్హులు లబ్ది పొందుతున్నారని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకొని త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించుకుందామని భరోసా ఇచ్చారు. ఓర్వకల్లు మండల పరిధిలోని కొంతలపాడు, గుట్టపాడు గ్రామాల్లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ గడపలో ప్రజలు బాబు పాలనపై దుమ్మెత్తిపోశారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top