ప్రజాసంక్షేమం కోసం వైయస్ జగన్ నిరంతర పోరాటం

బాబుది బూటకపు పాలన
విశాఖపట్నం ఈస్ట్))మాయమాటలతో బూటకపు పాలన సాగిస్తూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దగా చేస్తున్నారని , అభివృద్ధిని పక్కనపెట్టి కాలక్షేపం చేస్తున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం కన్వీనర్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్ మండిపడ్డారు. గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా 17వార్డు పెద జాలరిపేటలో ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి బాగోతాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ 17వ వార్డు అధ్యక్షుడు పి.నీలారెడ్డి, స్థానిక మహిళా నేత, నగర పార్టీ సహాయ కార్యదర్శి కారి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

టీడీపీకి ఓట్లేసి మోసపోయాం
కృష్ణా(కైకలూరు))వెంకటాపురం గ్రామంలో మండల కన్వీనర్‌ నీలపాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో  నిర్వహించిన గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) పాల్గొన్నారు.  స్థానిక నాయకులతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి లె లుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లేసి మోసపోయామని వాపోయారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పోసిన పాపారావు గౌడ్, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి నంబూరి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి అయినాల బ్రహ్మాజీ, వివిధ విభాగాల జిల్లా నేతలు షేక్‌ ఛానఖఖ్‌బాషా, కట్టా వెంకట్రామయ్య, చిట్టూరి బుజ్జి, పడమటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

రెండేళ్లు దాటిపోయింది..పైసా మాఫీ కాలేదు
శ్రీకాకుళం(నరసన్నపేటలో))‘టీడీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాపీ చేస్తామన్నారు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లకుపైగా దాటింది. అయినప్పటికీ రుణాలు మాపీ కాలేదు..’ అని సీఎం చంద్రబాబు తీరుపై మహిళలు మండిపడ్డారు. జలుమూరు మండలంలోని అక్కురాడ, కామినాయుడుపేట కాలనీలలో మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యలు, అర్హులకు ఇళ్లు తదితర వాటిపై పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన చెంచల అమ్మన్న, బోర శిమ్మన్న, పైల తవిటిమ్మ, చెంచల సరోజిని, లొట్టి రమణమ్మ తదితరులు కృష్ణదాస్‌ ఎదుట వాపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. ఆయన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు అన్నివర్గాల వారు మద్దతు ఇవ్వాలని కోరారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top