అన్ని విధాలుగా మోస‌పోయాం

న‌ర్సీప‌ట్నం(నాత‌వ‌రం): చ‌ంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామ‌ని చెప్ప‌డంతో బ్యాంకుల‌కు న‌గ‌దు చెల్లించ‌డం మానేశాం. ప్ర‌స్తుతం అప్పులు చేసి అధిక వ‌డ్డీలు క‌డుతున్నామ‌ని మ‌హిళ‌లు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మండ‌లంలోని ఎస్.బి.ప‌ట్నం, చిక్కుడు పాలెం గ్రామాల్లో గ‌డ‌ప‌గ‌డ‌పకూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించారు.  అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... ఎన్నిక‌ల‌కు ముందు ప‌దిహేనేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న టీడీపీ ఇప్పుడు ప్ర‌త్యేక ప్యాకేజీ అంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుంద‌ని ధ్వ‌జమెత్తారు. చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌ను ప్ర‌జ‌లు తెలుసుకుంటున్నార‌న్నారు. ప్ర‌జ‌లు త‌గిన స‌మ‌యంలో బాబుకు బుద్ధి చెబుతార‌న్నారు. 


Back to Top