జగనన్న పాలనలో కష్టాలన్నీ తీరిపోతాయి

చిత్తూరు జిల్లా(తంబ‌ళ్ల‌ప‌ల్లె):  నోటికి అడ్డూ అదుపు లేకుండా హామీలు కుమ్మ‌రించిన చంద్రబాబు అమ‌లులో మాత్రం చేతులెత్తేశార‌ని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌వ‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్ రెడ్డి తో క‌ల‌సి ఆయ‌న ప‌ర్య‌టించారు. గ్రామాల‌లో అర్హులైన వారికి ఫించన్ రావ‌డం లేద‌ని, ప‌క్కా ఇళ్ల నిర్మాణం జాడేలేద‌ని ప్ర‌జ‌లు నాయ‌కుల దృష్టికి తీసుకువ‌చ్చారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాం లో త‌న‌కు ఫించన్ వ‌చ్చేద‌ని, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌న ఫించ‌న్ ను రానివ్వ‌కుండా చేసింద‌ని ఓ వృద్ధురాలు క‌న్నీళ్ల  ప‌ర్యంత‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే రాజ‌న్న పాల‌న జ‌గ‌న‌న్న ద్వారా వ‌స్తుంద‌ని అంద‌రి క‌ష్టాలు తీరిపోతాయ‌ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆమెను ఓదార్చారు.  ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. 

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్సార్సీపీ భ‌రోసా
విజ‌యవాడ‌)) ప్రజ‌ల‌కు మేమున్నామ‌న్న భ‌రోసా క‌ల్పించ‌డాన‌కే గ‌డ‌ప‌గ‌వ‌కూ వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మ‌మ‌ని వైయ‌స్ఆర్ సీపీ పశ్చిమ ఇంచార్జ్ షేక్ ఆసీఫ్ అన్నారు. విజ‌యవాడ‌ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్లో ఆయ‌న గడపగడపకు వైయ‌స్ఆర్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు.  డివిజన్ ప‌రిధి లోని కేదారేశ్వర పేట ప్రాంతాల్లో వైయ‌స్ఆర్ సీపీ శ్రేణులు పర్యటించి టీడీపీ హామీల మొసాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బుల్లా విజయ్ గారు, విశ్వనాధ రవి, పీఎస్ రాజు, బాడిత శంకర్, కట్టా మలేశ్వరరావు, బత్తుల పాండు, పిళ్ళా సూరిబాబు, ఎం.చక్రపాణి తదితరులు పాల్గున్నారు.


Back to Top