మౌలిక స‌దుపాయాలు క‌రువు

విజ‌య‌వాడ‌:  తెలుగు దేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ్రామాల్లో మౌలిక స‌దుపాయాలు క‌రువ‌య్యాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ ఎం. జ‌గ‌న్‌మోహ‌న్‌రావు మండిప‌డ్డారు.  ప‌ట్ట‌ణంలోని 4, 5వ వార్డుల్లో సోమ‌వారం ఆయ‌న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకున్నారు. పార్టీ రూపొందించిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి చంద్ర‌బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అవినీతి సొమ్ముతో అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌కు టీడీపీ స‌ర్కార్ తూట్లు పొడుస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద్వారానే రాజ‌న్న రాజ్యం సాధ్య‌మ‌ని జ‌గ‌న్‌మోహ‌న్‌రావు తెలిపారు.

Back to Top