టీడీపీ అవినీతి పాలన

ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారు
చంద్రబాబు హామీల అమలు దారుణంగా ఉందని గోవిందపురం గ్రామస్తులు మండిపడ్డారు. రుణమాఫీ, ఉద్యోగం, నిరుద్యోగభృతి, ఇళ్లు, పెన్షన్లు ఇలా ఎన్నో హామీలిచ్చి నమ్మబలికి బాబు మోసం చేశారని విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం కన్వీనర్ ప్రగడ నాగేశ్వరరావు వద్ద గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాంబిల్లి మండలం గోవిందపురంలో నాగేశ్వరరావు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...చంద్రబాబు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి రాజధాని పేరిట హడావిడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోవడం లేదన్నారు. బాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

బాబుకు మీరే తగిన బుద్ధి చెప్పాలి
నంద్యాల నియోజకవర్గ ఇంఛార్జ్ రాజగోపాల్ రెడ్డి చాబోలు గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని, సంక్షేమ పథకాలు తమ దరికి చేరడం లేదని ఈసందర్భంగా ప్రజలు తమ కష్టాలను రాజగోపాల్ రెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. టీడీపీ పాలన అవినీతిమయమైందని, అభివృద్ధి కనుచూపు మేరలో కనబడడం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మోసకారి బాబుకు మీరే తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. ప్రజాబ్యాలెట్ అందించి బాబు పాలనపై మార్కులు వేయించారు. 

Back to Top