పేదలపై పన్నుల భారం

శ్రీకాకుళంః ప్రభుత్వం పేదలపై పన్నుల భారం మోపి ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని వైయస్సార్సీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ విమర్శించారు. కవిటి మండలం కుసుంపురం, పాతవారక గ్రామాల్లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రుణాలు మాఫీ కాలేదని, ఇళ్లు మంజూరు చేయడం లేదని ప్రజలు వాపోయారు. ఈసందర్భంగా సాయిరాజ్ మాట్లాడుతూ...పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మోసపూరిత ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని  ప్రజలకు పిలుపునిచ్చారు.


Back to Top