ఘనంగా నడికుడి సర్పంచ్‌ జన్మదిన వేడుకలు

నడికుడి(దాచేపల్లి): నడికుడి మేజర్‌ పంచాయతీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  సర్పంచ్‌ బు్రరి విజయ్‌కుమార్‌రెడ్డి 47వ జన్మదిన వేడుకలను నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో  ఘనంగా నిర్వహించారు.  పుట్టిన రోజు సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను సర్పంచ్‌ విజయ్‌కుమార్‌రెడ్డి కట్‌ చేశారు. కేక్‌తో పాటుగా స్వీట్లను పంపిణీ చేశారు. పార్టీ మండల కన్వీనర్‌ షేక్‌ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, బిసీసెల్‌ మండల కన్వీనర్‌ బత్తుల బాలయ్య, నాయకులు వేముల తిరుపతయ్య, కొలా జంపాలరెడ్డి, వేముల శ్రీహరి, ముశ్యం శ్రీనివాసరావు, నాళం శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్ని సర్పంచ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top