అధ్వాన్నపు రోడ్లతో ఇబ్బందులు పడుతున్నాం

నెల్లూరుః రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుజబుజ నెల్లూరులో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. మంచినీళ్ల సమస్యతో, అధ్వాన్నపు రోడ్లతో తాము పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బైపాస్ రోడ్డులో సర్వీస్ రోడ్డు లేక జరుగుతున్న ప్రమాదాలను వివరించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వానికి ప్రజల బాధలే పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డు విషయమై నెల్లూరు నుంచి ఢిల్లీ దాకా వినిపించామని... నేషనల్ హైవే అధికారులు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేశామని కోటంరెడ్డి చెప్పారు. ఇప్పటికైనా సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నేషనల్ హైవే కార్యాలయం ముందు నిరవధిక నిరసన ధర్నా తప్పదని హెచ్చరించారు.


Back to Top