ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే

క‌ర్నూలు:  టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతున్నా ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌ని, న‌గ‌రంలో ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త హ‌ఫీజ్‌ఖాన్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానికంగా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి బాబు మోస‌పూరిత హామీల‌పై మార్కులు వేయించారు.


Back to Top