బాబు పాలన పూర్తిగా వైఫల్యం
గడపగడపలో సమస్యల ఏకరవు
తాడిపత్రి: సొంత ఇళ్లు లేవు... ప్రస్తుతం ఉంటున్న ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి... కూలి డబ్బులు అద్దెలకే సరిపోతున్నాయి. ఇళ్లు గడపడం కష్టంగా ఉందని పట్టణంలోని గాంధీనగర్ కాలనీ చెందిన మహిళలు వైయస్సార్ సీపీ నియోజకవర్గ అదనపు సమన్వయ కర్త రమేష్‌రెడ్డికు విన్నవించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో పర్యటించారు. రేషన్ కార్డు, ఆధార్‌కార్డు ఉన్నప్పటికి పింఛన్ మంజూరు చేయలేదని పలువురు వృద్దులు వాపోయారు. కాలనీలో నీటి సమస్య ఉందని నాయకులకు విన్నవించారు. ఎన్నికలముందు అమలుగానీ హామీలతో ఊదరగొట్టిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నేతలు మండిపడ్డారు.
సబ్సిడీ అందలేదు..
అనంతపురం(ధర్మవరం): రోజురోజుకూ ముడిసరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. గతంలో అందిచినట్లు రేషన్ పై ఈ ప్రభుత్వం సబ్సిడీ అందచడంలేదు. అవస్థలు పడుతున్నామంటూ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలోని జోగోనికుంట, పార్థసారధినగర్‌లో వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ అయ్యాయా, లేదా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. బాబును నమ్మి మోసపోయామని, రుణాలు మాఫీ కాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయామని మహిళలు వాపోయారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
కర్నూలు: అధికారం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ విమర్శించారు. పట్టణంలోని పలు కాలనీలో ఆయన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు రెండేళ్ల పాలన, విస్మరించిన హామీల గురించి వివరించారు. ప్రజాబ్యాలెట్ పంపిణీ చేసి చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారో మీరే నిర్ణయించాలని కోరారు.