అవినీతి సర్కార్ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు

ప్రకాశంః గిద్దలూరు మండలం నరవ పంచాయతీ లోని బయన పల్లె గ్రామము లో నియోజకవర్గ ఇంచార్జ్ ఐవీ రెడ్డి గడప గడప కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సమస్యలతో సతమతమవుతున్నామని ప్రజలు వాపోయారు. సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవని, తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, కరువు పనికి సంబంధించిన డబ్బులు రావడం లేదని గ్రామస్తులు ఐవీరెడ్డి ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి పాలనకు తెరతీశారని ఐవీరెడ్డి మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.


Back to Top