పేదల సంక్షేమం కోసమే నవరత్నాలు

శాంతినగర్‌లో నవరత్నాల ప్రచారం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం):కొండపల్లి శాంతినగర్‌లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం వైయస్సార్‌ సీపీ గ్రామ కన్వీనర్‌ అడపా వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈకార్యక్రమంలో రాబోయే రోజుల్లో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా అమలు చేయనున్న నవరత్నాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. వైయస్సార్‌ కుటుంబంలో ప్రజలు చేరేవిదంగా ప్రొత్సహించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాను ప్రజలకు అర్థమైయ్యేలా వివరించారు. జగనన్న పాలనలో రాజన్న రాజ్యాన్ని చూస్తారనే నమ్మకాన్ని కలగజేశారు. కార్యక్రమంలో 18వనెంబర్‌ బూత్‌కమిటీ చైర్మన్‌ జానీపాషా, కార్యకర్తలు పాల్గొన్నారు.
..............................
చందోలు(పిట్టలవానిపాలెం): పేదల సంక్షేమం కోసమే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని ఆపార్టీ మండల కన్వీనర్‌ షేక్‌బాజి పేర్కొన్నారు. చందోలు మేజర్‌ పంచాయతీలో సోమవారం వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాలను వివరించారు. 9121091210 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి అహ్మద్‌ హుస్సేన్, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి మండే విజయ్‌కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రహీమ్, రఫి, మండల ఎస్సీసెల్‌ కార్యదర్శి బడుగు ప్రకాశరావు తదితరులు ఉన్నారు.
....................................................................
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టిడిపి
అంబాపురం(విజయవాడరూరల్‌)ః మోసపూరిత హామీలతో టిడిపి అధికారంలోకి వచ్చిందని విజయవాడ రూరల్‌ మండల మాజీ ఎంపీపీ తోడేటి రూబేన్‌ విమర్శించారు. సోమవారం అంబాపురం గ్రామ వైఎయస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు,మహిళలు తమకు పెన్షన్లు రావడంలేదని. జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదం తెలిపితేనే మాకు పెన్షన్లు వస్తాయని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగభృతి కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రూబేన్‌ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన టిడిపీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లువేసి బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. పార్టీ అధినేత ప్రకటించిన నవరత్నాల గురించి ఇంటింటికీ వెళ్ళి వివరించారు. గ్రామపార్టీ కన్వీనర్‌ నల్లమోతు చంద్రశేఖర్, కోకన్వీనర్‌ ప్రవీణ్‌కుమార్, పార్టీ నాయకులు అయిలా శివ, నక్కనబోయిన శ్రీనివాసరావు, సొంగా దయాకర్, షడ్రక్,జోజిబాబు ఇంద్రాస్,రాజబాబు, బాబీ, విజయ్,కె.నరేష్, శ్యామ్‌ శ్రీహరి, బిఓఆలు, గౌతమ్, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
.....................................................
నవరత్నాలతో ప్రజలకు చేరువ.
కంభంపాడు(వత్సవాయి) :వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల గురించి వివరించేందుకు గ్రామాల్లో ఇంటింటికి వెళ్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కమిటీ సభ్యులకు ప్రజలు చేరవవుతున్నారని గ్రామ సర్పంచ్‌ వేమిరెడ్డి వెంకటనారాయణరెడ్డి చెప్పారు. సోమవారం గ్రామంలోని 133 వ బూత్‌లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి వైయస్సార్‌ కుటుంబంలో ఎందుకు చేరాలో సవిరంగా తెలియజేస్తూ వారి సెల్‌ఫోన్ల నుండి మిస్‌డ్‌ కాల్‌ ఇప్పిస్తున్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల వల్ల ప్రజలకు జరిగే మేలు గురించి వివరిస్తూ అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. అదేవిధంగా భీమవరం గ్రామంలోని 95 వ బూత్‌లో కూడా వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో బూత్‌ కమిటీ కన్వీనర్లు నరాల మధుసూదనరెడ్డి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటి బాబు, గంగిపోగు రమేష్, సొసైటీ అధ్యక్షులు చింతకుంట్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు షేక్‌ నాగుల్‌హుస్సేన్, నరాల వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు తీగల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
=====================

రాజన్నరాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యం
చిలకలూరిపేటరూరల్‌: రాజన్న రాజ్యం వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డితోనే సాధ్యమౌతుందని వైయస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు చాపలమడుగు గోవర్ధన్‌ చెప్పారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పోతవరం, రాజాపేట, గొట్టిపాడు గ్రామాల్లో గడప గడపకూ వెళ్ళి ప్రజలతో ముచ్చటించారు. ప్రజల సంక్షేమాన్ని పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నవరత్నాలను అమలు చేసేందుకు ప్రణాళికను రూపొందించారన్నారు. విద్యార్ధులకు, మహిళలకు, రైతులకు, అర్హులైన పెన్షన్‌దారులకు, నిరుద్యోగులకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు వైయస్సార్‌ సీపీ చేయూతను అందిస్తుందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను, ప్రజలకు శాశ్వితంగా ప్రయోజనం కల్పించే విధంగా అమలు చేయటం జరుగుతుందన్నారు. వైయస్సార్‌సీపీకి అధికారాన్ని అందిస్తే అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తామన్నారు. టీడీపీ గత మూడున్నర సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి నిర్వహించలేదన్నారు. గ్రామాల్లో వైయస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌లు పార్టీకి అంకితభావంతో పనిచేసి విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో యువజన, ట్రేడ్‌యూనియన్‌ అధ్యక్షులు వేజెర్ల కోటేశ్వరరావు, పఠాన్‌ దౌలత్‌ఖాన్, నాగభైరు రామయ్య, బొద్దులూరి పరంధామయ్య, పల్లపు శేఖర్, గుంటు కొండలు, దేవరపల్లి రవి, వల్లెపు శివకోటి, వల్లెపు శ్రీనివాసరావు, కాకుమాను వెంకటేశ్వర్లు, శీలి నాగార్జున, జరుగుల చినసుబ్బారావు, జిలానీ బేగ్, జజ్జర రవి, బూదాటి బాబూరావు, జున్నుబుడే, కరిముల్లా, మౌలాలీ తదితరులు పాల్గొన్నారు.


తాజా వీడియోలు

Back to Top