కొత్తపల్లి(గంపలగూడెం): రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలుచేయాలని తిరువూరు ఎమ్మెల్యే కే రక్షణనిధి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని కొత్తపల్లిలో నిర్వహించిన వైయస్సార్ కుటుంబంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా ఆయన గ్రామంలో ఇంటింటికీ వెళ్ళి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న రాజకీయ వివక్షత కారణంగా నిజమైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు చేరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను వివక్షత లేకుండా అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌కే దక్కుతుందన్నారు. మళ్ళీ ఆరోజులు రావాలంటే వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంతి కావల్సి ఉందన్నారు. దీనికై జగన్‌ను బలపరుస్తూ ప్రజలు వైయస్సార్ కుటుంబంలో చేరాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి నవ్యాంద్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీలేకుండా పోరాడుతున్నారని వివరించారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే ప్రజాసమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయన్నారు. ముందుగా వైయస్సార్ విగ్రహానికి రక్షణనిధి పూలమాల వేసి నివాళి అర్పించారు. నీటిసంఘం మాజీ అధ్యక్షులు నరెడ్ల ఓగిరెడ్డి, సర్పంచ్ నరెడ్ల వెంకట్రావమ్మ, బూత్ కమిటీ కన్వినర్‌లు వంగల వైకుంఠం, మానుకొండ ఆదినారాయణరెడ్డి, నరెడ్ల మధుసూధనరెడ్డి, తల్లాడ లక్ష్మణరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు నరెడ్ల వెంకట కృష్ణారెడ్డి, పాలకేంద్రం అధ్యక్షులు నరెడ్ల జమలారెడ్డి, నీటిసంఘం అధ్యక్షులు నరెడ్ల జానకీరామిరెడ్డిల ఆద్వర్యంలోనిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి విక్కుర్తి నరశింహారావు, జిల్లా కమిటీ సభ్యులు చెరుకు నర్సారెడ్డి, ఆలపాటి ఉమా, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, మండల పరిషత్ వైఎస్సార్‌సీపీప్లోర్ లీడర్ బొల్లా కరుణాకర్‌రావు, పార్టీ ప్రముఖులు నాగమల్లేశ్వరరావు, ధనికొండ నర్సిరెడ్డి, బీ చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.<br/>