అప్పులు తీర్చేందుకు ఇళ్లు అమ్ముకుంటున్నాం

తూర్పుగోదావరి జిల్లా(జగ్గంపేట))తమ గ్రామంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని తిరుమలాయపాలెం వాసులు గడపగడపకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యక్రమంలో తమ గోడు వెళ్లగక్కారు. వైయస్‌ఆర్‌ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గ్రామంలో గడపగడపకూ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని నమ్మి అప్పు చేసి ఇళ్లు కట్టుకుంటే తీరా ఇప్పుడు అదే ఇళ్లు అమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు గ్రామస్తులు ముత్యాల శ్రీనివాస్‌ ఎదుట వాపోయారు. దీంతోపాటు మంచినీటి సరఫరాలో లోపాలు, పింఛన్లు, శిథిలమైన రోడ్లు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.


Back to Top